అసభ్య ప్రవర్తన: మగాడిని గొడ్డలితో నరికిన మహిళ

Woman kills a man for misbehaviour
ఒంగోలు: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ మహిళ తన బంధువులతో కలిసి హతమార్చింది. ఈ సంఘటన కందుకూరు మండలంలోని పాలూరు ఎస్సీ కాలనీలో జరిగింది. కోరుకొండ కాంతారావు (50) అనే వ్యక్తిని అతనికి సమీప బంధువే అయిన మహిళ తన సోదరులు, మరి కొందరు బంధువులతో కలిసి హత్య చేసింది.

కాంతారావు గురువారం ఉదయం కట్టెలు కొట్టేందుకు గొడ్డలితో పొలం వెళ్లగా అక్కడ కనిపించిన మరదలు వరుస అయిన మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడి గొడవ చేశాడు. దీంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ మహిళ తన సోదరులకు ఫోన్ చేయగా వారు మరికొందరు బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి కట్టెతో కాంతారావుని కొట్టారు. దీంతో అతను వారిపై గొడ్డలి విసిరే ప్రయత్నంలో పట్టు తప్పి పడిపోయాడు. మహిళ అదే గొడ్డలి తీసుకుని కాంతారావుని తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం ఆ మహిళ నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయింది. కాంతారావు భార్య నరసమ్మ, కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ అక్కేశ్వరరావు, రూరల్ ఎస్ఐ శివకుమార్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యచేసినట్టు మహిళ స్వయంగా అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

ఆమెతో పాటు సోదరులైన దార్ల నరసింహ స్వామి, శ్రీరంగనాయకులు, దార్ల మాలకొండయ్య, దార్ల మురళి, నెల్లూరుకి చెందిన బంధువులు సీహెచ్ నరసయ్య, వేణుగో పాల్‌ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధు వులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+