ప్రభుత్వ సిఎస్‌గా మహంతి, మాథ్యూస్‌కు వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పి.కె. మహింతిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ మిన్ని మాథ్యూ పదవి కాలం మంగళవారంనాడు ముగిసింది. దీంతో మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో మహంతి సంవత్సరం పాటు కొనసాగుతారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి మంగళవారం మిన్నీ మాథ్యూస్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు సొంత ఎజెండాలు ఏమీ లేవని ఆయన అన్నారు. తాను ఈ రాష్ట్రానికి చెందినవాడినేనని చెప్పుకున్నారు. ఒడిశాకు చెందిన మహంతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నారని కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూస్ పదవీ విరమణ చేశారు. విధి నిర్వహణలో సహకరించిన మంత్రులకు, అధికారులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. మహంతికి ఆమె పదవీ బాధ్యతలు అప్పగించారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని మహంతి చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రతి రోజూ సమీక్షిస్తానని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి ఎక్కవ ప్రయోజనం పొందేలా చూస్తానని ఆయన చెప్పారు. తాను హైదరాబాదువాడినని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications