రేప్‌కు గురైన బాలిక మృతి: బస్‌లోకి పిలిచి అత్యాచారం

బస్సులో తనపై అత్యాచారం జరిపాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజేశ్ కుమార్(35)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో జైపూర్‌లోని అంధుల ఆశ్రమంలో ఉంటున్న మైనారిటీ తీరని అమ్మాయిని వార్డెన్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. లొంగదీసుకునేందుకు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రశాంత్ వ్యాస్(35)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అత్యాచారానికి గురైన చిన్నారి మృతి
మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఓ ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగపూర్‌లోని ఆసుపత్రిలో ఐసియులో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి సోమవారం సాయంత్రం మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్ 17న ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం చెట్ల పొలాల్లో వదిలేసి పరారయ్యాడు. మసురటి రోజు తల్లిదండ్రులు బాలికను గుర్తించి జబల్ పూర్ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్య కోసం నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి నిన్న సాయంత్రం మృతి చెందిందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications