వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ మంత్రులు మా జైలుకు: కిరణ్, రఘువీరా హిట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
బెంగళూరు: కర్నాటక మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఆంధ్రప్రదేశ్ జైళ్లకు వస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం చమత్కరించారు. రెండు రోజుల కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన బెంగళూరు మహానగర పరిధిలో తెలుగువారు అధికంగా నివసిస్తున్న నాలుగు స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అవినీతి బిజెపిని ఓడించాలని, సుపరిపాలన కోసం కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పేదల పెన్నిధి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలకూ మేలు చేసే పథకాలెన్నో అమలు చేస్తున్నదంటూ ఆ జాబితా మొత్తం ప్రకటించారు. అంతేకాకుండా పథకాల అమలులో లోటుపాట్లను గుర్తించేందుకు స్వయంగా ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నానని వివరించారు.

బిజెపి అవినీతి వల్ల అభివృద్ధి స్తంభించిందని చెప్పారు. ఎస్ఎం కృష్ణ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నేటికీ స్మరించుకుంటున్నారన్నారు. మరోసారి బిజెపికి ఓట్లు వేయడమంటే వినాశనానికి స్వాగతం పలకడమేనని హెచ్చరించారు. బెంగళూరు మహానగరం మురికికూపంగా తయారైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కళాకాంతులు తెస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు ఆయనకు కాంగ్రెస్ అభ్యర్థులు ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు మంత్రులు రఘువీరారెడ్డి, టిజి వెంకటేశ్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు గంగా భవాని తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కిరణ్ సభకు హాజరైన అనేకమందికి తెలుగు తెలియకపోవడం వల్ల ఆయన ప్రసంగానికి వారినుంచి స్పందన అంతగా కానరాలేదు. అయితే, రఘువీరా రెడ్డి కొద్దిసేపు కన్నడ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు.

English summary
AP CM Kiran Kumar Reddy told the people of Karnataka 
 
 that only Congress would ensure their welfare. 
 
 Campaigning in Bangalore on Tuesday, the CM spoke of 
 
 the SC/ST sub-plan being implemented by the Congress 
 
 in AP and said such a plan would figure in the top 
 
 of the list if the Congress is voted to power in 
 
 Karnataka in the May 5 assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X