పదే పదే వేడి చేసిన టీ తాగుతున్నారా? వైద్యుల హెచ్చరిక!

ఇంట్లో ఉదయం ఒకసారి టీ తయారు చేసి, రాత్రి వరకు పదే పదే వేడి చేసి తాగేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో, ఇళ్లల్లో ఈ అలవాటు సాధారణం. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీని పదే పదే వేడి చేస్తే జరిగేదిదే

టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, కెటెకిన్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఒక్కసారి వేడి చేసిన తర్వాత ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. కానీ రెండో, మూడోసారి వేడి చేస్తే ఈ పోషకాలు ఆక్సీకరణ చెంది నాశనమవుతాయి. ఫలితంగా టీలోని ఔషధ గుణాలు బాగా తగ్గిపోతాయి.

tea repeatedly heating know the Side Effects and Health Risks doctors warning about tea reheating

ఎక్కువసార్లు వేడి చేసిన టీతో ఆరోగ్యానికి హాని

పదే పదే వేడి చేయడం వల్ల టానిన్స్ అధికం అవుతాయి. ఇవి కడుపులో అధిక అమ్లాలను ఉత్పత్తి చేసి, అసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, వంటి సమస్యలను కలిగిస్తాయి. దీర్ఘకాలంలో పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రైటిస్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు. అధిక టానిన్స్ శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీని వల్ల రక్తహీనత (అనీమియా) వచ్చే ప్రమాదం ఎక్కువ, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల్లో ఈ ప్రమాదం ఉంటుంది. .

నిద్ర సమస్యలు, రక్తపోటు, ఆందోళన ప్రమాదాలు

టీని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచి మళ్లీ వేడి చేస్తే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది నిద్ర సమస్యలు, ఆందోళన, రక్తపోటు పెరగడం వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పదే పదే వేడి చేసిన టీ చేదుగా మారి, రుచి పోతుంది.ఇది అనవసరంగా చక్కర లేదా పాలు ఎక్కువగా వాడే అలవాటును పెంచుతుంది, ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

పల్లీ రైస్ ఇలా తయారుచేస్తే మెతుకు కూడా మిగల్చరు!
పల్లీ రైస్ ఇలా తయారుచేస్తే మెతుకు కూడా మిగల్చరు!

చెయ్యాల్సింది ఇదే

ప్రతిసారీ తాజాగా టీ తయారు చేసి వెంటనే తాగండి. రోజుకు 2-3 కప్పులు మాత్రమే తాగడం ఉత్తమం. గ్రీన్ టీ, లెమన్ టీ, హెర్బల్ టీలు వంటివి తాగటం మంచిది. వైద్యులు చెబుతున్నట్లుగా, టీ ఆరోగ్యానికి మంచిదే కానీ తయారీ విధానం సరైనది కావాలి. పదే పదే వేడి చేసి తాగే అలవాటును మానేసి, తాజా టీ అలవాటు చేసుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను రక్షిస్తుంది మరియు టీ నుంచి ప్రయోజనం పొందడానికి సహాయపడుతుంది. ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవటం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+