హరికష్ణ, బాబు మధ్య తేడాల్లేవు: హీరో కళ్యాణ్‌రామ్

Kalyan Ram
తిరుపతి: రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య విభేదాలు లేవని హరికృష్ణ తనయుడు, సినీ హీరో కళ్యాణ్‌రామ్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

చిన్న విషయాలను మీడియాలో పెద్దగా చూపిస్తున్నారని, వారి మధ్య ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, అందరి మంచి కోరే వ్యక్తినని, చంద్రబాబు వెన్నంటే ఉండి పార్టీ కోసం తన వంత సహకారాన్ని అందిస్తానని ఆయన చెప్పారు.

విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు హరికృష్ణకు గైర్హాజరయ్యారు. దీంతో చంద్రబాబుకు, హరికృష్ణకు మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయని, అందుకే హరికృష్ణ ఆ సభకు హాజరు కాలేదని వార్తలు వచ్చాయి. ఈ ముగింపు సభకు నందమూరి హీరో బాలకృష్ణ, తారకరత్న హాజరయ్యారు.

హరికృష్ణతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. విశాఖ సభకు ఎందుకు రాలేదో హరికృష్ణనే చెప్పాలని ఆయన అన్నారు. అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందేనని, పార్టీ కుటుంబం కన్నా ముఖ్యమని ఆయన అన్నారు. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఆ మధ్య విశాఖపట్నంలో చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+