మిత్రులతో కలిసి ప్రియురాలిపై ప్రియుడి అత్యాచారం

ఆ దళిత బాలికను ఆమె ప్రియుడు మరో ముగ్గురితో కలసి ఏప్రిల్ 3న అత్యాచారం చేశారని, ఆ కారణంగానే ఆమె మృతి చెందిందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది. గుడివాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఆ బాలికను ఆమె స్వగ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రేమ పేరిట మభ్యపెట్టాడని ఆ బాలిక స్నేహితురాళ్లు చెప్పినట్లు తెలిసింది.
సంఘటన జరిగిన రోజున ఆ బాలిక రాజీవ్ యువకిరణాల శిక్షణ కోసం మచిలీపట్నం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రి యుడు ఆ బాలికను మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌కు తీసుకెళ్లి తన స్నేహితులతో కలసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. నాటినుంచి అస్వస్థతకు గురైన ఆ బాలికను ఆమె తల్లి మంగళగిరి సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చింది.
అయితే వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆ బాలిక తుది శ్వాస విడిచింది. కాగా ఘటన జరిగిన రోజే నిందితులను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం పోలీసులు సొమ్ము తీసుకుని విడిచిపెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications