లీడర్లకు జగన్ పార్టీ హెచ్చరిక: ఈనాడుపై మారెప్ప ఫైర్

కాంగ్రెసు పార్టీ సిబిఐ ముసుగులో ప్రత్యర్థుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తితో పని చేయడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కావాలనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం పైన కాంగ్రెసు పార్టీకే గౌరవం లేదని ఎద్దేవా చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈనాడుపై మారెప్ప మండిపాటు
ఈనాడు దిన పత్రిక పైన మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మారెప్ప మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. బతికినా.. చచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు.
జగన్‌తోనే ఉంటా: రెహ్మాన్
తన ప్రాణం ఉన్నంత వరకు తాను జగన్‌తోనే ఉంటానని, తాను జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నాననేది అవాస్తవమని, తనపై కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, మైనార్టీలకు జగన్ మాత్రమే న్యాయం చేయగలడని మైనార్టీ సెల్ నేత రెహ్మాన్ అన్నారు.












Click it and Unblock the Notifications