కూతురిని చంపి పాతిపెట్టిన తల్లి: శవమై తేలిన పాప

Women
హైదరాబాద్: ఓ కసాయి తల్లి కన్నబిడ్డనే పొట్టన పెట్టుకుంది. ఆ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన నాలుగేళ్ల చిన్నారిని తల్లి గొంతు నులిమి చంపింది. ఈ సంఘటన హైదరాబాదులోని బోరబండలోని మోతీనగర్‌లో చోటు చేసుకుంది. చిన్నారి శవాన్ని స్థానిక స్మశానవాటికలో పాతిపెట్టింది. పోలీసులు శవాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కిడ్నాపైన రెండు గంటల్లోనే హారిక అనే చిన్నారి శవమై తేలింది. గురువారం ఉదయం పది గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు హారికను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే స్థానిక పోచమ్మ చెరువులో శవమై తేలింది. హారిక తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్నోవా బోల్తా పడి ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లాలోని తొమ్మిదవ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇన్నోవా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద చోటు చేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

దొంగల స్వైరవిహారం

వరంగల్ జిల్లా హన్మకొండ మండలం కాజీపేటలోని సిద్ధార్థ నగర్‌లో నలుగురున దొంగలు స్వైర విహారం చేశారు. కత్తితో బెదిరించి పది లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారు నగలును దోచుకుని వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+