చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు వియ్యంకుడి ఇంట్లో చోరీ: పనిమనిషిపై అనుమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చెన్నై: కేంద్ర మంత్రి చిరంజీవి వియ్యంకుడి నివాసంలో గురువారం చోరీ జరిగింది. ఇంటి పనిమనిషిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పని మనిషి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని టీ నగర్‌లో గల చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో 12 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

బ్యూరో నుంచి డబ్బులు పోయిన విషయాన్ని గ్రహించిన చిరంజీవి పెద్ద కూతురు మామ శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేస్తున్న చిన్నయ్యపై శివప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శివప్రసాద్ ఇంట్లో చిన్నయ్య ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గత మూడు రోజులుగా అతను కనిపించడం లేదు.

కనిపించకపోవడంతో చిన్నయ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నయ్య పుడుకొట్టాయ్‌కి చెందినవాడని తెలుస్తోంది. చిరంజీవి వియ్యంకుడికి చెదంిన ఇదే ఇంటిపై గతంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 44 లక్షల రూపాయల మేరకు ఉద్యోగార్థులను మోసం చేసిన 52 ఏళ్ల వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బిపిసిఎల్‌లో తనకు మంచి సంబంధాలున్నాయని నమ్మబలికి టి నగర్‌లోని పాండిదురై యువతను మోసం చేశాడు. పరమశివం, అరుల్ కృష్ణన్ కలిసి 44 లక్షల రూపాయల మేరకు వసూలు చేసి పాండుదురైకి ఇచ్చారు.

English summary
Police are searching for a domestic help, who is suspected to have looted Rs 12 lakh from the house of a relative of Telugu film star Chiranjeevi in T Nagar on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X