దాడి నిస్పృహ: బాబు, వైయస్ భారతి ఫాక్షనిస్టు: వర్ల

కర్నూలు జిల్లాలో సహకార ఉద్యోగి సోమన్న కిడ్నాప్ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కిడ్నాప్ కేసును మిస్సింగ్ కేసుగా మార్చారని మండిపడ్డారు. ముఠా నాయకులు, హంతకులను రక్షించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెడు చేసుకోవడం చాలా సులభమని, మంచి చేసుకోవాలంటే చాలా సమయం పడుతుందని చంద్రబాబు చెప్పారు. ఇందుకు మంచి ఉదాహరణ దాడి వీరభద్రరావు అని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతికి ఫాక్షనిస్టు నేపథ్యం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు. భారతికి అధికారులను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ ముఠా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అవినీతి దెయ్యంగా ప్రజలకు వెల్లడించాలని ఆయన సిబిఐని కోరారు. వైయస్ జగన్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అంటే ఒంటికాలిపై లేచే దాడి వీరభద్ర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలవడం రాజకీయ విచిత్రమని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అభివర్ణించారు.












Click it and Unblock the Notifications