దాడిని వద్దని జగన్‌కి చెప్పినా చేర్చుకున్నారు: కొణతాల

Konathala Ramakrishna
హైదరాబాద్: తన జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావును పార్టీలో చేర్చుకుంటే నష్టమని తాను తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు చెప్పానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం అన్నారు.

ఆయనను చేర్చుకుంటే పార్టీకి నష్టమని చెప్పినా చేర్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో తన కార్యకర్తలు అంతే ముఖ్యమన్నారు. తన కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు.

కాగా, కొణతాల రామకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కొణతాల వర్గానికి ఇచ్చాకే తన వర్గానికి ఇవ్వమని జగన్‌కు చెప్పానని, కొణతాలతో తనకు ఆజన్మ శతృత్వం లేదని దాడి వీరభద్ర రావు అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు చేశారు. కానీ, కొణతాల వర్గం మాత్రం దాడి రాకను జీర్ణించుకోలేక పోతోంది.

దాడి ఇప్పుడు అలా చెప్పినప్పటికీ జిల్లాలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని కొణతాల వర్గం భావిస్తోంది. దీంతో మరో పార్టీలోకి వెళ్తామని కొణతాలకు ఆయన కార్యకర్తలు ఒత్తిడి తీసుకు వస్తున్నారట. కొణతాలకు కూడా దాడి రాక తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+