ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య: ఉరేసుకున్నమరో విద్యార్థిని

బుధవారం ఉదయం గాయత్రి తండ్రి సతీష్‌తో పాటు ఇంటి నుంచి బయలుదేరింది. పొరుగువారికి ఇంటి తాళం చెవి ఇచ్చి వెళ్లారు. రాత్రి సతీష్ ఇంటికి వచ్చాడు. అప్పటికే గాయత్రి తాళం చెవి తీసుకుందని పొరుగువారు సతీష్‌కు చెప్పారు. అయితే, తలుపులు మాత్రం తాళం వేసి ఉన్నాయి. తలుపులను రెండు వైపుల నుంచి తీయవచ్చు. గాయత్రి మొబైల్ ఫోన్ కూడా ఎత్తలేదు.
గాయత్రి మిత్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చునని భావించి సతీష్ బంధువలు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయం వచ్చి చూసేసరికి కూడా ఇల్లు తాళం వేసే ఉంది. సతీష్ కొత్త తాళం చెవితో తలుపులు తెరిచాడు. గాయత్రి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. పడక పక్కన సూసైడ్ నోట్ కనిపించింది. తన మరణానికి ఎవరూ కారణం కాదని అందులో రాసింది.
మరో సంఘటనలో గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బన్సీలాల్‌పేటలో దర్శిని త్రివేది అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని గురువారంనాడు ఉరేసుకుని మరణించింది. పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో తప్పడంతో తీవ్ర నిస్పృహకు గురై దర్శిని ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications