Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ చెప్పినట్లే వినాలి, స్వేచ్ఛలేని మంత్రులు: సారయ్య

YS Rajasekhar Reddy - Basawaraj Saraiah
హైదరాబాద్/ఏలూరు: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. వైయస్ చెప్పినట్లే మంత్రులు వినవల్సి వచ్చేదన్నారు. ఆయన చెప్పినట్లు విన్నందు వల్లనే ఇప్పుడు అందరు కళంకితులుగా మిగిలిపోతున్నారని సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీకి సేవ చేస్తా: ధర్మాన

మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ... తాను అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. మంగళవారం ధర్మాన పుట్టిన రోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తద్వారా ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రేపు ఆయన తన రాజకీయ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరోవైపు రాజీనామా చేసిన ధర్మాన, సబితలకు పలువురు మంత్రులు సంఘీభావం తెలుపుతున్నారు. ధర్మానను మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రఘువీరా రెడ్డి, సబితా రెడ్డిని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్ తదితరులు కలిశారు. కాగా తాను గవర్నర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని డి శ్రీనివాస్ చెప్పారు. మంత్రుల రాజీనామాపై కామెంట్ చేసేందుకు ఆయన ఇష్టపడలేదు. అయితే డిఎస్, బొత్సలు గవర్నర్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పార్థసారథిపై దేవినేని ఉమ ఫైర్

అక్రమాలకు పాల్పడ్డ మంత్రి పార్థసారథిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+