క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: తీవ్రంగా రియాక్టైన ఆనం

ఐపిఎల్ బెట్టింగ్స్‌పై ఆనం మండిపాటు
ఐపిఎల్ బెట్టింగ్స్ పైన గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మధ్య తరగతి యువకులను ప్రలోభాలకు గురి చేసి ఇల్లు గుల్ల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగులో బడా నాయకులు కూడా ఉన్నారని ఆరోపించారు.
లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్నారు. ఏ పార్టీకి చెందిన వారైన బెట్టింగులకు పాల్పడితే అరెస్టు చేయాలన్నారు. ఐపిఎల్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దానిని బ్యాన్ చేస్తే తప్ప గ్యాంబ్లింగ్ ఆపే శక్తి లేదన్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వారే బెట్టింగులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దర్యాఫ్తు ముమ్మరం
ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ పైన విచారణ ముమ్మరం అయింది. పోలీసులు ఢిల్లీ నుండి ముంబయికి, హైదరాబాదుకు చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియంతో పాటు హోటళ్లలో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాదుకు ప్రత్యేక టీం వచ్చింది.












Click it and Unblock the Notifications