ఎండ దెబ్బకు మతిపోయింది: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి

కెసిఆర్ కన్నా పరుషంగా తాము మాట్లాడగలమని, ఆయితే తమకు సభ్యత అడ్డు వస్తోందని ఆయన అన్నారు. తల తిక్క మాటలు మాట్లాడి తమ పార్టీని బలహీనపరుద్దామని కెసిఆర్ అనుకుంటే చెల్లదని ఆయన అన్నారు. తెరాస నుంచి వెళ్లిపోతున్నవారి గురించి కెసిఆర్ ఆలోచించాలని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యవహారాన్ని రఘునందన రావు బయట పెట్టారని ఆయన అన్నారు.
వంద శానససభ్యులను గెలుచుకున్నా కెసిఆర్ శానససభలో తెలంగాణపై తీర్మానం చేయలేరని, 165 మంది ఎంపిలున్నా బిజెపి తెలంగాణ బిల్లును తేలేకపోయిందని, 16 మంది ఎంపిలతో కెసిఆర్ తేవడం దుర్లభమని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడేది తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీపై ఒత్తిడి తేకుండా తెలుగుదేశం పార్టీని కెసిఆర్ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. వేయి మంది విద్యార్థుల సమాధుల మీద వంద సీట్లు సంపాదించాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కెసిఆర్‌ను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణపై పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఎందుకు కెసిఆర్ డిమాండ్ చేయలేదని ఆయన అడిగారు. కెసిఆర్ అసలు రంగు తెలిసి తెరాస నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ భాష తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఉచ్చనీచాలు మరిచిపోయారని అన్నారు.
కెసిఆర్ తమ పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. ఉద్యమాల పేరుతో కెసిఆర్ కోట్లు గడించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, బేరసారాల కోసం కాంగ్రెసును కాపాడే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications