కెసిఆర్‌పై తలసాని ఫైర్: మేం క్లియర్: యనమల

కెసిఆర్ హుందాగా వ్యవహరిస్తే మంచిదని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. కెసిఆర్ కన్నా వందరెట్లు తాము బాగా మాట్లాడగలమన్నారు. చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడితే సంహించమని, కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని తలసాని హెచ్చరించారు.
ఇదిలావుంటే, తెలంగాణపై తమ పార్టీ స్పష్టత ఇవ్వలేదనే విమర్శలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చామని, అయినా కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆనయ అయన అన్నారు. మహానాడులో ప్రతిపాదించే రాజకీయ తీర్మానంలో తెలంగాణ ప్రదానాంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు జరిగే మహానాడు ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు.
గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను శనివారం 16 కమిటీల నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంతో పాటు కళంకిత మంత్రుల తొలగింపు, విలువలతో కూడిన రాజకీయాలపై చర్చ ఉంటాయని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తీర్మానాల రూపేణ చర్చించి ఆమోదిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications