వారంలో పెళ్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ కుమారుడు కన్న తండ్రినే హత్య చేసాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లి ఆ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య తన తండ్రి గంగారాం (68)ని హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
కడప జిల్లా బద్వెల్ ఆర్టీసి బస్ స్టాండులో ఓ బస్సు వీరంగం సృష్టించింది. బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడేళ్ల రాకేష్ అనే బాలుడు మృతి చెందాడు. పక్కనే ఉన్న అతని కుటుంబ సభ్యులు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూర్‌లోని నెల్లూరుపాలెంకు చెందిన మాధవి, చంద్రమోహన్ కుటుంబ సభ్యులు పది మంది వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి బ్రహ్మంగారి మఠానికి బయలుదేరారు. బెంగళూర్ నుంచి వచ్చిన ఆర్టీసి బస్సులోంచి దిగి బ్రహ్మంగారి మఠం వెళ్లేందుకు బస్సు కోసం వేచిచూస్తుండగా ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా రావూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ప్రయాణికులు కూర్చున్న ప్రదేశంలోకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications