ఆఫర్స్‌తో తెరాసలోకి ఎంపీలు: బాబును దులిపేసిన టిజి

 MPs may join in TRS on 2nd June
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఎంపీలు వివేక్(పెద్దపల్లి), మంద జగన్నాథం(నాగర్ కర్నూలు), రాజయ్య(వరంగల్)లు జూన్ 2వ తేదిన తెరాసలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అధిష్టానం తెలంగాణపై తేల్చకుంటే తాము మరో పార్టీలో చేరుతామని వారి ఇటీవలె హెచ్చరించారు. వచ్చే నెల 2న తెరాస హైదరాబాదులోని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

ఇదే వేదికగా ఎంపీలు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరనున్నారు. వారితో పాటు తెలంగాణ డాక్టర్స్ జెఏసి నేత నర్సయ్య కూడా చేరనున్నారు. పార్టీలో చేరుతున్న ఎంపీలకు కెసిఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మందా జగన్నాథంకు ఆయన ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్ కర్నూలు టిక్కెట్‌తో పాటు తనయుడికి ఆలంపూర్ ఎమ్మెల్యే టిక్కెట్, వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇచ్చి ఆయన సోదరుడు వినోద్‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

బాబుపై టిజి వెంకటేష్ నిప్పులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మంత్రి టిజి వెంకటేష్ బుధవారం నిప్పులు చెరిగారు. తెలంగాణపై లెటర్ ఇచ్చామని చెప్పి పార్టీ ఫండ్ వసూలు చేయడానికే టిడిపి మహానాడు పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు లేఖ ఇచ్చి ఉంటే ఇంతమంది యువకులు ఆత్మహత్య చేసుకొని ఉండేవారు కాదు కదా అని ప్రశ్నించారు.

మహానాడులో తెలంగాణపై లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా బాబు సీమాంధ్రలో ఘోరంగా నష్టపోతారన్నారు. తెలంగాణలో ఓట్ల కోసం సీమాంధ్రలో ఓడిపోతారన్నారు. తెలంగాణ ఉద్యమం బలహీనపడుతున్న సమయంలో మహానాడు నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉందన్నారు. తెలంగాణ ఇస్తే జిల్లాకో రాష్ట్రం అడుగుతారన్నారు. తెలంగాణ నేతల్లో తప్ప ప్రజల్లో తెలంగాణవాదం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+