వేర్వేరుగా నివాళి!: జూ.ఎన్టీఆర్ టు తారకతర్న (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హీరో నందమూరి బాలకృష్ణ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి తదితరులు నివాళులు అర్పించారు.
మే 28 ఎన్టీఆర్ జయంతి. ఆయన జయంతి రోజునే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మహానాడును నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాలు టిడిపి గండిపేటలో మహానాడును నిర్వహించింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. తనకు ఆహ్వానం అందనందునే వెళ్లలేదని జూనియర్ చెప్పగా... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం అవసరం లేదని, ఎప్పుడు ఇవ్వలేదని టిడిపి చెబుతోంది.
తనకు ఆహ్వానం అందలేదన్న జూనియర్ వ్యాఖ్యలపై తారకరత్న స్పందిస్తూ... ఆహ్వానంపై రావాల్సిన అవసరమనేముందని ప్రశ్నించారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం హరికృష్ణ, ఆయన పెద్ద బావ దగ్గుపాటి వెంకటేశ్వర రావు కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు. జూనియర్ ఉదయం రాగా, హరికృష్ణ, కల్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణలు కలిసి వచ్చారు. అంతకుముందు పురంధేశ్వరి కుటుంబ సభ్యులు వచ్చారు.

ఎన్టీఆర్ ఘాట్‌కు సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్

తాత స్మృతి చిహ్నం వద్ద మనవడి నివాళి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూర్చున్న దంపతులు

ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తున్న పురంధేశ్వరి కుటుంబం

పురంధేశ్వరి కుటుంబ సభ్యుల నివాళులు

ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణంలో కూర్చున్న పురంధేశ్వరి కుటుంబ సభ్యులు

ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణంలో కూర్చున్న పురంధేశ్వరి కుటుంబ సభ్యులు

వస్తున్న హరికృష్ణ

హరికృష్ణ నివాళి

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులతో హరికృష్ణ, కల్యాణ్ రామ్

కల్యాణ్ రామ్, చిన్నారుల నివాళులు

లక్ష్మీ పార్వతి

టిడిపి నేతలతో పాటు ఎన్టీఆర్ వేషధారి

చంద్రబాబు, బాలకృష్ణల రాక

బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ సభ్యుల నివాళి

ఘాట్ వద్ద కూర్చున్న బావబావమరుదులు

హీరో తారకతర్న...












Click it and Unblock the Notifications