వంద అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలే లక్ష్యం: కెసిఆర్

కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను తెలంగాణ నాయకులకు ఏనాడైనా సముచిత స్థానం కల్పించాయా అని నిలదీశారు. పొరపాటున టిడిపికి అధికారం ఇస్తే నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని, పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు తప్ప తెలంగాణకు ఆ పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో కూడా ఆంధ్రా పెత్తనమేనన్నారు.
జగన్ పార్టీ విధానం కూడా అదేనన్నారు. తెలంగాణలో 85 శాతం మంది బలహీన వర్గాల వారే ఉన్నారని అందువల్ల దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కరెంట్ కష్టాలు తీర్చేందుకు 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు శ్రీకారం చుడతామని, దీని కోసం గోదావరి పరివాహక ప్రాంతంలో విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు.
మూడేళ్ల పాటు రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా, తదుపరి 24 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 21లక్షల పంటరుణ ఖాతాలున్నాయని, ఇందులో లక్ష రూపాయల మేర ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications