స్పాట్ ఫిక్సింగ్: భజ్జీ, చెన్నై ఆటగాళ్లను విచారిస్తారా?

తర్వాతి మ్యాచులకు హర్భజన్‌ను ఫిక్సింగ్‌కు సిద్ధం చేయాలని గురునాథ్ మేయప్పన్ తనకు చెప్పినట్లు బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గురునాథ్‌తో సంబంధాలున్న ఆటగాళ్ల వాంగ్మూలాలు తీసుకునే విషయంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
గురునాథ్‌తో సాన్నిహిత్యం ఉన్న చెన్నై హోటల్ యజమాని విక్రమ్ అగర్వాల్ అలియాస్ విక్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ముంబై పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న బుకీలు సంజయ్ జైపూర్, పవన్ జైపూర్, చంద్రేష్ అలియాస్ జూపిటర్‌లతో సంభాషణలపై పోలీసులు వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.
పలువురు ఆటగాళ్లు చెన్నైలోని అగర్వాల్ హోటల్‌ను సందర్శిస్తూ ఉండేవారు. అగర్వాల్ గురునాథ్‌కు సన్నిహిత మిత్రుడు. అగర్వాల్‌కు సమన్లు జారీ చేయడానికి ముంబై పోలీసులు చెన్నై వెళ్లారు. అయితే, అతను అందుబాటులో లేడు. అగర్వాల్ తన భార్య పేరు మీద సిమ్ కార్డు తీసుకుని దాని ద్వారా మాట్లాడుతూ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications