ఛత్తీస్‌గఢ్ దాడి: రాజకీయ కుట్రా, చేతులు మారిన కోట్లు?

ఛత్తీస్‌గడ్‌లో తిరుగులేని రాజకీయ ఆధిపత్యమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఈ కుట్రకు తెర తీశారా!? 'ఆపరేషన్ కర్మ'కు రూ.100 కోట్లు చేతులు మారాయా!? ఇప్పుడు ఈ ప్రశ్నలు అందర్నీ వేధిస్తున్నాయి. మావోల దాడిలో తమ చిరకాల శత్రువు, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు, ఛత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడు నంద కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్‌ను చనిపోయారు.
ఈ మొత్తం ఘటన వెనక ఎవరెవరున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగానే ఇది అధికార బిజెపివైఫల్యమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశానికే సవాలని బిజెపి అంటోంది. కానీ, కర్మ కుటుంబ సభ్యులు, అనుచరుల వాదన భిన్నంగా ఉంది. ఇది రాజకీయ హత్య అని కుటుంబ సభ్యులు అంటుంటే, స్పష్టంగా ఇది అజిత్ జోగి కుట్రేనని కర్మ అనుచరులు మండిపడుతున్నారు.
సుక్మా కేంద్రంగా కుట్ర సాగిందని, దీని వెనక రూ.100 కోట్లు చేతులు మారాయని ఒక ప్రచారం సాగుతోంది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు ఈ కుట్రలో పాల్పంచుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే, మావోయిస్టులకు బద్ధ వ్యతిరేకి అయిన కర్మ.. గనుల తవ్వకాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచారు. దీంతో, కర్మను హతమార్చడానికి వారేందుకు పన్నాగం పన్నుతారు? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.












Click it and Unblock the Notifications