మహానాడు జోష్: చంద్రబాబుకు బాలకృష్ణ విందు

బుధవారం రాత్రి బాలకృష్ణ నివాసంలో జరిగిన ఈ విందుకు చంద్రబాబు కుటుంబమంతా హాజరైంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కొందరు ఈ విందుకు హాజరయ్యారు. మహానాడు విశేషాలు, వర్తమాన రాజకీయ వ్యవహారాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి జూన్ 15వ తేదీన అమెరికాలో ఎంబీఏ డిగ్రీ అందుకొంటున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి ఈ రెండు కుటుంబాలవారూ హాజరవుతున్నారు. ఆ పర్యటనపై కూడా వారు చర్చించుకున్నారు.
కాగా, చంద్రబాబుకు మరో బావమరిది నందమూరి హరికృష్ణ పూర్తిగా దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరమయ్యారు. హరికృష్ణ మొదటి రోజు మహానాడుకు మొక్కుబడిగా వచ్చి, మర్నాడు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications