జగన్ లాయర్ సిబిఐకా?: తప్పుపట్టిన మైసూరా రెడ్డి

Mysoora Reddy
హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారశైలిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి గురువారం మండిపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు లబ్ధి చేకూరేలా సిబిఐ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ రెండు పార్టీల చేతిలో సిబిఐ కీలుబొమ్మ అయిందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి సిబిఐకి వ్యతిరేకమే తప్ప.. కోర్టు, కోర్టు తీర్పులకు వ్యతిరేకం కాదన్నారు. తమకు కోర్టులపై గౌరవం ఉందన్నారు. సిబిఐ పరోక్షంగా కోర్టులను ప్రభావితం చేస్తోందన్నారు. జగన్ తరఫున వాదించిన లాయర్ సిబిఐ తరఫున వాదించడం ఎంత వరకు సమంజసమన్నారు.

ఒక కేసులో వాది తరఫున ఉన్న లాయర్ ప్రతివాది వైపు వెళ్లడం ఎంత వరకు సమంజసమని మద్రాస్ హైకోర్టు, పంజాబ్ కోర్టులు తీర్పు ఇచ్చాయన్నారు. మాజీ మంత్రి శంకర రావు పిటిషన్ వేసినప్పుడు కోర్టు అడ్వయిజర్‌గా ఉన్న న్యాయవాది టిడిపి సంబంధీకుడని కథనాలు వచ్చాయన్నారు. జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి అప్పుడే అంకురార్పణ జరిగిందన్నారు.

సిబిఐ ఎంత పతనస్థాయికి దిగజారిందో అర్థమవుతోందన్నారు. కాంగ్రెసు, టిడిపి నేతలతో సిబిఐ జాయింట్ డైరెక్టర్ మాట్లాడారని ఆరోపించారు. కోర్టులను ప్రభావితం చేస్తూ తమపై ఆరోపణలు చేయడం కాంగ్రెసు, టిడిపిలకే చెల్లిందన్నారు. జగన్ పైన ఇన్ని ఛార్జీషీట్లు ఏ నిబంధనల ప్రకారం వేస్తున్నారో చెప్పాలన్నారు.

వెన్నుపోటుదారుడు: గోనె

తమ ధర్నాలతో కోర్టులను ప్రభావితం చేస్తారన్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై గోనే ప్రకాశ్ రావు మండిపడ్డారు. కోర్టులంటే తమకు గౌరవముందని, చంద్రబాబుకే లేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు అధ్యక్ష పదవిని ఇస్తానని మాట తప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+