జైల్లో ఎందుకో, మంచి మాత్రమే మీదా?: షర్మిలకు బొత్స

Botsa Satyanarayana
విజయవాడ: దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చిందని, థర్డ్ ఫ్రంట్ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం మండిపడ్డారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు భావోద్వేగాలతో పుట్టిన పార్ట అన్నారు. దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే ఆ పార్టీ పుట్టుకు వచ్చిందన్నారు. తమ పార్టీ పూర్తి పేరు చెప్పుకోలేని స్థితిలో జగన్ పార్టీ ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాలో ఉన్నవన్నీ కాంగ్రెసు పథకాలే అన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలోని మంచి మాత్రమే తమదని, అవినీతితో తమకు సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హత్య చేసిన వ్యక్తికంటే ఆర్థిక నేరాలకు పాల్పడేవారే ప్రమాదకరమని అన్నారు. జగన్ తప్పు చేయకుంటే జైలులో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

వ్యాపారం సాగిస్తున్న పార్టీలో ఒకరిద్దపు పార్లమెంటు సభ్యులు చేరారని తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో చంద్రబాబు పగటి కలలు కంటున్నారన్నారు. మహానాడు తీర్మానాలు హాస్యాస్పదమన్నారు. బిసిలకు వంద సీట్లు ఇస్తానంటున్న చంద్రబాబు గతంలో ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పాలన్నారు.

చంద్రబాబు ఆచరణ సాధ్యం హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రైతులను విస్మరించారని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. బలహీన వర్గాల కోసం వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించటిన ప్రభుత్వం తమదే అన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నప్పటికీ అభివృద్ధి ఆగలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+