డిఎల్ నోరే కారణం: బర్తరఫ్‌పై ఆనం, దామోదర మద్దతు

Anama Vivekananda Reddy
చిత్తూరు/హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ మంత్రి, మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌కు ఆయన నోరే కారణమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం ఉదయం అన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతికి పాల్పడే నాయకులను కాపాడే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. నిజాయితీగల ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ లక్ష్యం అదే అన్నారు.

డిఎల్ నివాసం వద్ద సందడి

హైదరాబాదులోని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఇంటి వద్ద మంగళవారం సందడి నెలకొంది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను కలుసుకునేందుకు పలువురు నాయకులు వచ్చారు. సొంత నియోజకవర్గం మైదుకూరు నుండి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. డిఎల్ నివాసానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రానున్నారని సమాచారం.

రేపు ఉదయం ఢిల్లీకి కిరణ్

కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతర్గత భద్రతా సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు. దాంతో పాటు రాష్ట్ర పరిస్థితుల పైన ఆయన చర్చించనున్నారు. కాగా, కిరణ్‌ను మంత్రులు పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయ రామరాజు, ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డిలు కలుసుకున్నారు.

ఆజాద్‌తో బొత్స, రాజయ్య భేటీ

కేంద్రమంత్రి, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్యలు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+