రాష్ట్ర కాంగ్రెసు అఫైర్స్: ఢిల్లీలో వేడెక్కిన పంచాయతీ

డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకులు మొత్తం ఢిల్లీకి చేరినట్లు భావిస్తున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడాన్ని బొత్స సత్యనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జనా రెడ్డి కూడా డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జానా రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. జానారెడ్డి, పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య మంగళవారం ఆజాద్‌తో సమావేశమయ్యారు.
పంచాయతీ ఎన్నికల గురించి చర్చించడానికే తనను ఆజాద్ ఢిల్లీకి ఆహ్వానించినట్లు జానా రెడ్డి చెప్పారు. అయితే, తెలంగాణపైనే కాకుండా డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌పై కూడా జానారెడ్డి ఆజాద్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు. రేపు సాయంత్రం దామోదర రాజనర్సింహ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.
రేపు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయనతో డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ తర్వాత తలెత్తిన పరిణామాలపై, తెలంగాణపై ఆజాద్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బొత్స సత్యనారాయణతో మంత్రి జానా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు సమావేశమయ్యారు. సిఎల్పీలోకి డిఎల్ రవీంద్రారెడ్డిని అనుమతించకపోవడం బాధ కలిగించిందని హనుమంతరావు అన్నారు. డిఎల్ రాజీనామా సమర్పించినప్పుడే ఆమోదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం గవర్నర్ నర్సింహన్‌ను రాజభవన్‌లో కలిశారు. తాజా పరిణామాలపై ఆయన గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications