లాడ్జిలో యువతులు స్నానం చేస్తుండగా ఫోన్లో చిత్రీకరణ

హైదరాబాదులో ఆత్మహత్య
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మణికొండలో ఓ విద్యార్థిని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కలప పట్టివేత
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం చెలుకూరు ప్రాంతంలో అక్రమంగా కలపను వ్యాన్‌లో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. కలప విలువ రూ.70వేలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కలపను కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.
భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
గుంటూరు శివారులో ఘోరం జరిగింది. ఇరిగేషన్ డిపార్టుమెంటులో అటెండర్‌గా పని చేస్తున్న నాగేశ్వర రావు భార్య గొంతు కోసి హతమార్చాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications