వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరితెగించాడు, చంద్రబాబుతో ఒప్పందం: డిఎల్‌పై వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బరితెగించిన నేత అని కమలాపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం మండిపడ్డారు. డిఎల్ ప్రవర్తన తెలిసినందువల్లే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని విమర్శించారు. డిఎల్ గంగమ్మకు వదిలిన దున్నపోతులాంటివాడన్నారు. డిఎల్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

నిన్ను ఎవరైనా చేర్చుకుంటే తేలును చేర్చుకున్నట్లే అన్నారు. ఇంతకాలం డిఎల్ చేసిన తప్పులను భరించినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను మెచ్చుకుంటున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదిరిందని డిఎల్ వర్గం వారే చెబుతున్నారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డిఎల్ ఎప్పుడు కూడా నడుచుకోలేదన్నారు.

డిఎల్ కలుపు మొక్క కాబట్టే కిరణ్ తొలగించారన్నారు. అలాంటి కలుపు మొక్కలను ఏరి వేయాల్సిందేనన్నారు. సహకార ఎన్నికలలో డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రతిపక్షాలైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అభ్యర్థుల గెలుపుకు సహకరించారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో డిఎల్ ఓడినా కిరణ్ దయ వల్లనే మంత్రిగా కొనసాగారని చెప్పారు.

కాగా ముఖ్యమంత్రి ఇటీవల డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన విదేశాలలో ఉండగా ఇది జరిగింది. దీంతో అతను ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన డిఎల్‌ను పలువురు నేతలు కలుసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిపై మాటల దాడి చేస్తున్నారు. దీనికి కిరణ్ వర్గం ఎదురు దాడి చేస్తోంది.

English summary
Kamalapuram MLA Veerasiva Reddy alleged that agreement between DL Ravindra Reddy and TDP chief Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X