బిక్కుబిక్కుమని: బాబుపై గత స్మృతులు చెప్పిన ఆనం

Anam Ramanarayana Reddy and Chandra babu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆ పార్టీలోకి తీసుకు వచ్చింది తానేనని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం నాడు అసెంబ్లీలోని తన ఛాంబరులో విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును టిడిపిలోకి తెచ్చిందే తానని చెప్పారు. 1983లో తొలి మహానాడు కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిందని, ఆ సమావేశానికి తాము వెళ్తున్న సమయంలో చంద్రబాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తన నివాసానికి వచ్చారని, అప్పుడు ఆయనను తాము తన కారులోకి ఎక్కించుకొని వెళ్లామన్నారు.

అప్పట్లో తెలుగుదేశం పార్టీలో అందరూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు అనుచరులే ఉండటంతో చంద్రబాబు కూడా బిక్కుబిక్కుమంటూ భయంతో వెనుకాలే ఉండిపోయారని, చివరకు తాము వారినందరిని అదిరించి బాబును లోపలకు తీసుకు వెళ్లి పార్టీలో చేరేలా చేశామని ఆనం తెలిపారు.

అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా దిగ్విజయ్ సింగ్‌ను నియమించడం మంచిదేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే దిగ్విజయ్ సింగ్‌ను గులాం నబీ ఆజాద్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెసుకు ఇంఛార్జిగా నియమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+