కావూరిది పైచేయి: దగ్గుబాటి పురంధేశ్వరికి షాక్

చివరకు, ఒత్తిడి తెచ్చి కావూరి సాంబశివ రావు తన పంతం నెగ్గించుకున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి కన్నా మెరుగైన రీతిలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరారు. దీంతో పురంధేశ్వరికి ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు విశాఖపట్నం పార్లమెంటు సీటు కోసం రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి కయ్యానికి కాలు దువ్వుతుండగా తనను సహాయ మంత్రి హోదాలోనే ఉంచి, కావూరికి కేబినెట్ హోదా ఇవ్వడం వల్ల పురంధేశ్వరి స్థాయి తగ్గినట్లయింది.
ఈసారి కేబినెట్ హోదా కోసం పురంధేశ్వరి తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. నిజానికి, గత విస్తరణ సమయంలోనే పురంధేశ్వరికి కేబినెట్ హోదా ఇవ్వాలని ప్రధాని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పాటు పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వాలనే ఆలోచనను కావూరి తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో పురంధేశ్వరిని సహాయ మంత్రి పదవికి మాత్రమే పరిమితం చేశారని అన్నారు.
క్యాబినెట్ హోదా కోసం పురంధేశ్వరి ఈసారి కూడా అంతర్గతంగా భారీ స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. లాబీయిస్ట్‌గా పేరున్న విశాఖకు చెందిన ఓ మాజీ పార్లమెంటు సభ్యుడు ఆమె పక్షాన లాబీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. గతంలో ఏ జౌళి శాఖ క్యాబినెట్ హోదా కోసమయితే పురంధీశ్వరి లాబీయింగ్ చేశారో, ఇప్పుడు అదే శాఖను ఆమెను వ్యతిరేకించే అదే సామాజికవర్గానికి చెందిన కావూరు సాంబశివరావుకు ఇచ్చారు. దీంతో పురంధేశ్వరికి షాక్ ఇచ్చినట్లే అయింది.












Click it and Unblock the Notifications