వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి కొద్ది మంది ఎపి యాత్రికులు: చిరు పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన కొంత మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు గురువారంనాడు న్యూఢిల్లీకి చేరుకున్నారు. వారు ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేరుకున్నారు. వారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పరామర్శించారు. ఉత్తరకాశీ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా న్యూజిలాండ్ తరహాలో రోప్‌వేలు ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు.

chiranjeevi

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక చర్యల్లో భాగంగా వారు ఢిల్లీకి చేరుకున్న బాధితులను రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాషరావు కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రికులను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని, వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కోట్ల చెప్పారు. మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ కూడా బాధితులను పరామర్శించారు.

దుగ్గిరాలవాసులు మృతి

ఉత్తరకాశీ యాత్రలో వరదల తాకిడికి గుంటూరు జిల్లా దుగ్గిరాలవాసులు మృతి చెందినట్లు సమాచారం. ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన మల్లీశ్వరి, కుమారి మరణించినట్లు గుంటూరు జిల్లా అధికారులకు పోన్లు వ్చచాయి. దాంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.

ఇదిలావుంటే, కేదార్‌నాథ్ వరదల్లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ఆరుగురు చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్నవారి సురక్షితంగా తీసుకుని రావాలని కామారెడ్డికి చెందినవారు విజ్ఞప్తి చేశారు. వారు షబ్బీర్ అలీని కలిసి ఆ విజ్ఞప్తి చేశారు.

English summary
Few Andhra Pradesh tourists to Uttarakhand have reached New Delhi today. Union ministers from AP Chiranjeevi and Kotla Suryaprakash Reddy visited them at AP Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X