వీడిన మిస్టరీ: భార్యను హత్య చేసిన టెక్కీ అరెస్టు

Techie plots wife's murder, held
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆనందనగర్ కాలనీలో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. తన సొంత ఫ్లాట్లో టెక్కీ భార్య శుక్రవారం పట్టపగలు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. 28 హతురాలు షాగుఫ్తా షెరీన్ హత్య కేసులో పంజగుట్ట పోలీసులు ఆమె భర్త అమీర్ మొహమ్మద్ జమాల్‌ను ఆదివారం అరెస్టు చేసారు.

రహేజా ఐటి పార్కులో గల ఐపి సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మియాపూర్‌లోని సెరామిక్ వరల్డ్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న అతని మిత్రుడు సుధాంశు నేతా అలియాస్ సన్నీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తాను నేరం చేసినట్లు పోలీసు విచారణలో నిందితుడు అంగీకరించాడు. అమీర్ సూచన మేరకు దొంగిలించిన మూడు తులాల బంగారాన్ని, రూ.2.97 లక్షల నగదును సన్నీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ మారేడుపల్లిలో గల సన్నీ ఇంటి నుంచి పోలీసులు కత్తిని, రక్తమరకలు అంటిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

షెరీన్ పెళ్లయినప్పటి నుంచి తనను వేధిస్తోందని, దాంతో తల్లిదండ్రుల నుంచి దూరం కావాల్సి వచ్చిందని, వరకట్నం వేధింపుల కేసు పెడతానని కూడా బెదిరించిందని అమీర్ పోలీసులతో చెప్పాడు. దాంతో బాల్య స్నేహితుడు సన్నీతో కలిసి అమీర్ భార్య హత్యకు పథకం వేశాడు. శుక్రవారం ఉదయం కార్యాలయానికి వెళ్లే ముందు సన్నీకి అమీర్ తన ఫ్లాట్ డూప్లికేట్ కీ ఇచ్చాడు. షెరీన్‌కు నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చాడు.

పోలీసుల అందించిన వివరాలు ఇలా ఉన్నాయి - అమీర్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత సన్నీ డూప్లికేట్ కీతో ఫ్లాట్ తాళం తీశాడు. నిద్రపోతున్న షెరీన్‌ను వంటింట్లోని కత్తితో పొడిచి చంపాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. బంగారం, నగదు తీసుకుని సన్నీ వెళ్లిపోయాడు. ఆ రకంగా నగలు, నగదు కోసమే దొంగతనం జరిగిందనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించాడు.

తెలిసినవారే హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడిన సూచనలు కనిపించలేదు. హత్య చేసిన తర్వాత తాళం వేసి వెళ్లాడు. దాంతో అమీర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. సన్నీతో మాట్లాడడానికి అమీర్ కొత్త సెల్‌ఫోన్, సిమ్ కార్డు వాడుతున్న విషయాన్ని గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+