వరదలపై బాబుది రాజకీయమే ఐతే..: లోకేష్ కౌంటర్
హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని అధికార కాంగ్రెసు పార్టీ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో భిన్నంగా స్పందించారు.
వరదల నేపథ్యంలో బాబు రాజకీయం చేస్తున్నారనే కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై లోకేష్ స్పందిస్తూ.. ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడం రాజకీయమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయమే అనుకుంటే... ఆయన రాజకీయం బాధితులకు అన్నం పెట్టేలా చేసిందని అభిప్రాయపడ్డారు.

అందుకు సంబంధించిన ఓ వార్తా పత్రిక వార్తను కూడా అందులో ఉంచారు. బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే! అనే వార్త ఓ పత్రికలో వచ్చింది. దానిని ఉంచారు. చంద్రబాబు ఢిల్లీలోని ఎపి భవన్‌కు రాకముందు సాంబరు అన్నం, పెరుగు మాత్రమే పెట్టేవారని, బాబు ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రే మెనూ మారిపోయిందని, అన్నం, పప్పు, పెరుగులతో పాటు కూరగాయలు పెడుతున్నారని అందులో పేర్కొన్నారు.
మరోవైపు నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ... బాధితులకు ఎలా చేయాలో తాము చేసి చూపించామని, రాజకీయ లబ్ధి కోసమనే విమర్శలు సరికావని, తాము సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. కాగా బాధితుల కోసం తెలుగుదేశం పార్టీ విమానాలను ప్ర్తత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు చికిత్స కోసం వైద్య బృందాన్ని పంపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించింది.












Click it and Unblock the Notifications