తెలంగాణ వచ్చేస్తోంది!: మంత్రుల్లో ధీమా, సీమాంధ్రుల్లో..

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ మంత్రులలో ధీమా క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ కాంగ్రెసు నేతలు భారీ బహిరంగ సభను తలపెట్టారు. ఆ సమావేశానికి కాస్త అటు ఇటుగా తెలంగాణపై ప్రకటన రావొచ్చునని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణకు అనుకూలంగా దాదాపుగా నిర్ణయం ఉండవచ్చునని భావిస్తున్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కాకపోయినా, రాయలసీమ లోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి ఇచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదిన తలపెట్టిన సభను విజయవంతం చేయాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. భారీ జన సమీకరణలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానా రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.
మరోవైపు సీమాంధ్ర నేతల్లో మాత్రం అలజడి ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు అప్రమత్తమవుతున్నారు. వారు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications