తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం: వైయస్ విజయమ్మ

స్థానిక సంస్థలకు నిధులు, విధులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో అందరూ కలిసికక్టటుగా పార్టీ విజయం కోసం పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై నిఘా పెట్టాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు.
కార్యకర్తల క్రమశిక్షణను ఆమె కొనియాడారు. పంచాయతీలకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్నీ సమకూర్చారని, ఇప్పుడు అన్నీ చతికిలపడ్డాయని విజయమ్మ అన్నారు. ఈ ప్రభుత్వం ఆర్టీసి చార్జీలను మూడు సార్లు పెంచిందని, విద్యుత్తు చార్జీలు కూడా పెంచిందని ఆమె విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి ఏ విధమైన సహాయం తీసుకుని రావడం లేదని ఆమె విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్నో ఆంక్షలు విధించారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే అన్నింటినీ సక్రమంగా అమలు చేస్తామని విజయమ్మ చెప్పారు.












Click it and Unblock the Notifications