ముంబై యువతి ఇష్రత్ జహాన్ టెర్రరిస్ట్ కాదు: సిబిఐ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) బుధవారం గుజరాత్ హైకోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయనుంది. ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాది కాదని సిబిఐ తన ఛార్జీషీటులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం... 2004లో ఇష్రత్ సహా నలుగురిని తీవ్రవాదులుగా భావించి అహ్మదాబాద్ ఔట్ స్కర్ట్స్‌లో కాల్చి చంపారు. కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో ఇష్రత్ టెర్రరిస్టు కాదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాఫ్తుకు మరికొంత సమయం పడుతుందని, కుట్ర కోణంలో దర్యాఫ్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

కాగా ముంబై కళాశాలకు చెందిన యువతి ఇష్రత్ జహాన్, ప్రనేష్ పిళ్లై అలియాస్ జావెద్ షేక్, అంజద్ అలీ, జిషన్ జోహార్‌లు 2004లో అహ్మదాబాదులో గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతుండగా, నకిలీ ఎన్‌కౌంటర్‌గా సిబిఐ చెబుతోంది.












Click it and Unblock the Notifications