సెక్స్‌కు ఆ నేతకు మహిళలు కావాలట, ఫిర్యాదు

Uttar Pradesh
లక్నో: లైంగిక క్రీడకు మహిళలు కావాలన్నారంటూ ఓ మహిళ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన సీడిని ఇస్తూ ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరేయ్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి స్థాయి గల ఓ నాయకుడు తనకు యువతులు లైంగిక క్రీడకు కావాలంటూ అడిగినట్లు ఆ మహిళ ఆరోపిచింది.

పాలక ఎస్పీ మాజీ నేత మధు పాండే సిడీని జిల్లా మెజిస్ట్రేట్‌ ఎస్ రాజలింగానికి ఇస్తూ ఫిర్యాదు చేశారు. ఓ రాష్టర్ శాఖ చైర్మన్‌గా వ్యవహరిస్తూ క్యాబినెట్ హోదా గల నేతకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషణలు ఆ సిడీలో రికార్డయ్యాయి.

పాండే ఫిర్యాదుతో పాటు ఆడియో సిడీ తనకు అందిందని జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం ధ్రువీకరించారు. వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ పోలీసులకు సిడీని ఇచ్చినట్లు రాజలింగం చెప్పారు. సిడీని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు.

మధు పాండేకు, ఆ నాయకుడికి మధ్య రెండు నిమిషాల పాటు సంభాషణ జరిగింది. తన వద్దకు వస్తే ఫరవా లేదు గానీ తగిన ఏర్పాట్లతో రావాలని, సరుకు బాగుండాలని ఎస్పీ నాయకుడు అన్నట్లు సిడిలో రికార్డయింది. సరుకు గురించి ఆందోళన అక్కర్లేదని, తెచ్చే సరుకు ఏ మాత్రం అసంతృప్తికి గురి చేయదని మధు చెప్పింది. తనకు 19, 20 ఏళ్ల మధ్య వయస్సు గల యువతి కావాలని అతను మధుకు చెప్పినట్లు సమాచారం.

మహిళలను తీసుకురావాలని, డబ్బులు ఇవ్వాలని ఆ ఎస్పీ నాయుకుడు తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని మధు పాండే ఆరోపిస్తోంది. తన భర్తకు ఉద్యోగం కోసం అతని డిమాండ్లకు అంగీకరించక తప్పలేదని పాండే అంటోంది. నిరుడు అక్టోబర్‌లో తమ మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసినట్లు తెలిపింది.

ఈ సంఘటనపై ఎస్పీ అధికార ప్రతినిధితో పాటు ఇతర నాయకులు ప్రతిస్పందించడానికి నిరాకరించారు. ఎస్పీ నేతను వెంటనే పదవి నుంచి తొలగించి, వ్యవహారంపై విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+