వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు ఎంతుందో నాకంతే: రమ్య, కిరణ్‌కు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR and Ramya
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎంత హక్కుందో, తనకు అంతే హక్కు ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ మహిళా అధ్యక్షురాలు రమ్య శుక్రవారం మండిపడ్డారు. కెసిఆర్‌ను విమర్శిస్తే దాడులు చేస్తారా అని ఆమె మండిపడ్డారు.

ఆమె ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. కెసిఆర్ కుటుంబం నుండి తనకు రక్షణ కల్పించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ఫంక్షన్ హాల్ పైన జరిగిన దాడి విషయమై కేసు పెట్టారా? అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రమ్యను అడిగారు.

కాగా బుధవారం కరీంనగర్‌లో రమ్యకు చెందిన ఫంక్షన్ హాల్ పైన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహిళా కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు ఓటమి: నాగం

కాంగ్రెసు పార్టీ తెలంగాణ పేరుతో నాటకాలు ఆడుతోందని, ఇప్పుడు తెలంగాణ ఇవ్వకుంటే ఆ పార్టీ ఓటమి ఖాయమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కోలేక కాంగ్రెసు పార్టీ సిబిఐని ఉసిగొల్పుతోందన్నారు.

కొత్త పార్టీ: బైరెడ్డి

తమకు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. 2014 ఎన్నికలు ఆత్మ గౌరవానికి, స్వార్థ రాజకీయాలకు మధ్య పోటీ అన్నారు. ఆగస్టులో రాయలసీమ పరిరక్షణ సమితిని రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పారు.

English summary
Telangana Rastirya Lok Dal leader Ramya has met CM Kiran Kumar Reddy on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X