హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలైట్ హోటల్ విషాదం: పదిహేడుకు చేరిన మృతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని రాష్ట్రపతి రహదారిలో కుప్పకూలిన సిటీ లైట్ హోటల్ భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటనలో ఇంకా నలుగురి ఆచూకి తెలియలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆచూకి తెలియకుండా పోయిన వారిలో పలువురిని శిథిలాల కింద మంగళవారం గుర్తించారు. టీ మాస్టర్ వెంకటేష్, చీఫ్ కుక్ కిరణ్, హోటల్ మేనేజర్ అలీ రజాక్‌లు మృతి చెందారు. మరో మృతదేహం కూడా లభించింది.

సిటీ లైట్ హోటల్ శిథిలాల తొలగింపు శరవేగంగా సాగుతోంది. జిహెచ్ఎంసి కమిషనర్ కృష్ణబాబు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రంలోగా శిథిలాల తొలగింపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. గల్లంతైన వారిలో అలీ, భరత్, వెంకటేష్, కిరణ్ అనే నలుగురు వర్కర్ల ఆచూకీ గల్లంతవడంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. అందులో వెంకటేష్, కిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

City Light Hotel

సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో మృతి చెందిన మృతదేహాలు గాంధీ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రాక కోసం మార్చిరీలోనే మృతదేహాలను భద్రపర్చారు.

మరోవైపు సిటీ లైట్ ప్రమాదం నేపథ్యంలో నగరంలోని పాత భవంతులను జిహెచ్ఎంసి అధికారులు కూల్చి వేస్తున్నారు. మోండా మార్కెట్, మంగళ్ హాట్ ప్రాంతాలలో జిహెచ్ఎంసి అధికారులు భవనాలను కూల్చి వేస్తున్నారు. సిటీ లైట్ హోటల్ భవనాన్ని ఆనుకొని ఉన్న భవనాన్ని కూల్చి వేయాలని జిహెచ్ఎంసి అధికారులు నిర్ణయించారు. పాత భవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.

English summary
According to last reports, The death toll crossed 16 in Hyderabad City Light Hotel collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X