సూర్యపై వేటులో బిగ్ ట్విస్ట్- గంభీర్ పట్టు ? సెలెక్టర్లకు 2 ఆప్షన్స్ ..!

ఈ ఏడాది భారత్ కు టీ20 వరల్డ్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav)పై సెలెక్టర్లు తాజాగా నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. వరల్డ్ కప్ తో పాటు ఐపీఎల్ లో సూర్య ఫామ్ ను కారణంగా చూపుతూ కెప్టెన్సీ తొలగింపుతో పాటు జట్టులో కూడా స్ధానం లేకుండా చేశారు. సెలెక్టర్లు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ పై ఇంత దారుణంగా వ్యవహరించాలా అని మాజీ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.

ఈ నేపథ్యంలో తాజాగా మరో విషయం బయటికి వచ్చింది. సూర్య కుమార్ యాదవ్ ను ఇంగ్లండ్ టూర్ కు కెప్టెన్సీ నుంచి, జట్టులో నుంచి తప్పిస్తూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నది హెడ్ కోచ్ గౌతం గంభీరే (Gautam Gambhir). సూర్యను ఫామ్ కారణం చూపించి తప్పించాల్సిందేనని పట్టుబట్టింది గంభీరే అని తెలుస్తోంది. క్రిక్‌బ్లాగర్.కామ్ ప్రకారం లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, అలాగే 2028లో మరో టీ20 ప్రపంచ కప్ టైటిల్ అందించాలనుకుంటున్నట్లు సూర్యకుమార్ బహిరంగంగా ప్రకటించడం గంభీర్‌కు నచ్చలేదు.

Gautam Gambhir Pushed For Suryakumar Yadav Sacking as T20I Captain Report Reveals Two Options
SKY: సూర్యకు మరో బిగ్ షాక్ ? సోషల్ మీడియాలో హింట్..!
SKY: సూర్యకు మరో బిగ్ షాక్ ? సోషల్ మీడియాలో హింట్..!

జట్టులో అతని స్థానం, నాయకత్వ పాత్ర అనేవి, ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో నిలకడగా రాణించే అతని సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయని కోచ్ గంభీర్ సూర్యకుమార్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా ఫామ్ లో లేని సూర్యను తప్పించాలని సెలెక్టర్లపై
ఒత్తిడి తెచ్చారు. అలాగే జట్టు నుంచి పూర్తిగా తప్పించాలని కూడా సూచించారు. ఈ అభిప్రాయానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మద్దతు తెలిపారు. దీంతో సూర్యపై వేటు పడిపోయింది.

Gautam Gambhir Pushed For Suryakumar Yadav Sacking as T20I Captain Report Reveals Two Options
Suryakumar Yadav:
Suryakumar Yadav:

గంభీర్ సంజు సామ్సన్, ఇషాన్ కిషన్‌లను కెప్టెన్‌లుగా కోరుకున్నారని కూడా తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీకి అభ్యర్థులుగా గంభీర్ మొదట సంజు సామ్సన్, ఇషాన్ కిషన్‌లకు అనుకూలంగా ఉన్నారని, కానీ దీనికి అగార్కర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ మెరుపులను చూపుతూ శ్రేయస్ అయ్యర్ ను ఇంగ్లాండ్ టూర్ కు కెప్టన్ గా ఎంపిక చేసారు. ఆ తర్వాత గంభీర్ ఈ విషయాన్ని బీసీసీఐతో చర్చించగా..కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తొలగించే విషయంలో వారికి ప్రాథమిక అనుమతి లభించిందని, మరిన్ని సంప్రదింపుల తర్వాత గంభీర్-అగార్కర్ చివరకు అయ్యర్‌ను తమ ప్రాధాన్య ఎంపికగా అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+