ఏపీలో మరో కొత్త విమానాశ్రయం.. ఆ ప్రాంతానికి మహర్దశ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలు కీలక ప్రాజెక్టులను ఏపీకి బహుమతిగా ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీని ఏవియేషన్ హబ్ గా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించుకున్న కూటమి ప్రభుత్వం, ఏపీలో మరిన్ని ఎయిర్పోర్ట్ ల ఏర్పాటు పైన ఫోకస్ చేస్తుంది.

చీరాల మరొక గోవాగా అభివృద్ధి

ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో కీలక ప్రకటన చేశారు. తాజాగా బాపట్లలోని చీరాలలో ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు చీరాలను మరొక గోవాగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సూర్యలంక, చీరాల, బాపట్ల బీచ్ లు అత్యంత అందమైన బీచ్ లను పేర్కొన్న చంద్రబాబు, ఈ బీచ్లను అభివృద్ధి చేసి సద్వినియోగం చేస్తే పర్యాటక రంగంలో భారీ మార్పు వస్తుందన్నారు.

Chirala airport Andhra CM Chandrababu says Chirala will be developed like Goa with a airport

చీరాల పక్కనే చిన్న ఎయిర్పోర్ట్ నిర్మిస్తామన్న చంద్రబాబు

హైదరాబాద్లో సెలవురోజుల్లో జనం ఖాళీగా ఉంటే సూర్యలంక వంటి బీచ్ లకు వస్తారని, అందుకే చీరాలను గోవా తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో చీరాల పక్కనే చిన్న ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోవా తరహాలో చీరాలను అభివృద్ధి చేస్తున్న క్రమంలో దానికోసం రోడ్లు పోర్టులు విమానాశ్రయాలు ఏర్పాటుచేసి లాజిస్టిక్స్ హబ్ గా మార్చే ప్లాన్లో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

మౌలిక వసతుల కల్పనపైన, అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి

ఈ నిర్ణయంతో ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చంద్రబాబు చెప్పారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపైన, అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి సారించిన క్రమంలో చీరాల ఎయిర్పోర్ట్ ప్రకటన స్థానికులకు సంతోషం కలిగిస్తుంది.

శ్రీవారి భక్తులకు గాల్లో తేలిపోయే వార్త.. గంటలోనే తిరుపతికి ప్రయాణం!
శ్రీవారి భక్తులకు గాల్లో తేలిపోయే వార్త.. గంటలోనే తిరుపతికి ప్రయాణం!

చంద్రబాబు త్వరలోనే ఈ ప్రాజెక్టు పైన ఫోకస్

పర్యాటకంగా ఏపీని అభివృద్ధి చేయడంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న పర్యాటక ప్రాంతాలకు, ఎయిర్పోర్ట్ సౌకర్యాలను కల్పించడం నిజంగా ఏపీ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. సీఎం చంద్రబాబు త్వరలోనే ఈ ప్రాజెక్టు పైన ఫోకస్ చేయనున్నట్టు తాజాగా ఆయన ప్రకటనతో స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+