మహిళా రోగి ప్రైవేట్ పార్ట్స్ తాకిన సెక్యూరిటీ గార్డు.. ఉద్యోగం ఊస్ట్! (వీడియో)

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జరిగిన దారుణ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ మహిళా రోగితో సెక్యూరిటీ గార్డు అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఎయిమ్స్ కఠిన చర్యలు తీసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన ఎయిమ్స్ యాజమాన్యం ఆ సెక్యూరిటీ గార్డును ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా కఠిన చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ సెక్యూరిటీ గార్డుకు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా జరిమానా విధించారు. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో
రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో

మహిళా రోగికి ఎదురైన చేదు అనుభవంపై శనివారం ఎయిమ్స్ అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే అంతర్గత విచారణ జరిపి నిందితుడైన సెక్యూరిటీ గార్డును తొలగించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అంతే కాకుండా అతడిని విధుల్లోకి తీసుకున్న సంబంధిత ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై కూడా చర్యలు చేపట్టి జరిమానా విధించారు.

Delhi AIIMS Security Guard Fired After Molesting Female Patient Police case registered and security agency fined

పోలీసులకు ఫిర్యాదు
ఈ విషయాన్ని కేవలం అంతర్గత చర్యలకే పరిమితం చేయకుండా ఎయిమ్స్ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు ద్వారా నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రికి మహిళా రోగులు, వారి సహాయకుల భద్రత విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని ఎయిమ్స్ స్పష్టం చేసిది. మహిళలపై ఎలాంటి వేధింపులు లేదా దుష్ప్రవర్తనను సహించబోమని ఎయిమ్స్ స్పష్టం చేసింది. రోగులందరికీ, వారి కుటుంబాలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఎయిమ్స్ తెలిపింది. పోలీసు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ప్రస్తుతం తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండేలా అవసరమైన చర్యలు కొనసాగిస్తామని కూడా ఎయిమ్స్ పేర్కొంది.

చైనాకు కేంద్రం బిగ్ చెక్- అనూహ్య ఎత్తుగడ
చైనాకు కేంద్రం బిగ్ చెక్- అనూహ్య ఎత్తుగడ

8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి మరణశిక్ష
మరోవైపు మహారాష్ట్రోలని పాల్ఘర్ కోర్టు మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. 2021లో దహను ప్రాంతంలో 8 ఏళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి పాల్పడి పారతో దారుణంగా కొట్టిన 50 ఏళ్ల ప్రఫుల్ల రత్న ఘోషే(ప్రముల్) అనే నిందితుడికి కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. పోక్సో చట్టం కింద విచారణ పూర్తి చేసి నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.75,000 జరిమానా విధిస్తూ ఆగస్టు 7 పాల్ఘర్ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+