సమైక్యవాద రాజీనామాలు తప్పుకాదు: మైసురా రెడ్డి

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అభిప్రాయం చెప్పకుండా తామెలా చెబుతామని ఆయన అడిగారు. కేంద్రం తెలంగాణపై ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చిన తమను నిర్దిష్టంగా అభిప్రాయం అడిగితే చెబుతామని ఆయన అన్నారు. ముందు అధికార పార్టీ చెప్తే తర్వాత తాము చెబుతామని ఆయన అన్నారు. సమైక్యవాదం డిమాండ్‌తో తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంపై స్పందిస్తూ - ఏ పరిస్థితుల్లో అలా స్పందించారో తెలియదని, పౌరులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారని, తమ రాజీనామాలను వారు స్పీకర్‌కు ఇవ్వలేదని చెప్పారు.
తెలంగాణపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి రాదా అని అడగ్గా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ తప్పినట్లు అవుతుందని ఆయన వివరించారు. అయినా తామే కనిపిస్తున్నామా ? కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్లు కూడా రాజీనామా చేశారని, వారిని అడగండని మైసురారెడ్డి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు గురించి దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ - దాన్ని వన్‌సైడ్ లవ్ ఎఫైర్‌గా ఆయన వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై వైఎస్ విజయలక్ష్మి 14, 15 తేదీల్లో దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. వేదికను తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications