కాంగ్రెస్ పోతేనే: తెలంగాణపై బిజెపి, చిటికేసి చెప్పిన డిగ్గీ

Venkaiah Naidu
హైదరాబాద్/ఒంగోలు: కాంగ్రెసు పార్టీ పోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని, సమస్యకు కాంగ్రెసు పార్టీని పారద్రోలడమే పరిష్కారమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శనివారం ప్రకాశం జిల్లా కందుకూరులో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ 2004లో కండువాలు కప్పుకుని తెలంగాణ ఏర్పాటుకు వాగ్దానం చేశాయని కానీ, తొమ్మిదేళ్లుగా నానుస్తూనే ఉండటం కాంగ్రెస్ విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.

ఢిల్లీలో శుక్రవారం ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఇందులో భాగమేనన్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆ భేటీ తర్వాత కూడా సమైక్యవాదులకు రాష్ట్రం ఒకటిగానే ఉంటుందని, ప్రత్యేక వాదులకు విడిపోతుందని నమ్మకం కలిగేలా ప్రకటనలు చేయించటం ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ పద్ధతులకు అద్దం పట్టిందన్నారు. తెలంగాణ పై ఇప్పటికీ చర్చల పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ తీరు- పెళ్లయ్యాక వధూవరుల జాతకాలు చూస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.

దేశంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేంద్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో దారుణంగా వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపే శక్తి బిజెపికి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మాత్రం తమ నాయకుడెవరో ప్రకటించలేని దుస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఎన్డీఏ మాత్రమేనని స్పష్టం చేశారు.

తమ నుంచి విడిపోయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ త్వరలోనే తన తప్పు తెలుసుకుంటారన్నారు. జైహింద్ అంటే హిందువులకి జై, ముస్లింలకు నై' అని అర్థమా? అంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ కూర్చుంటే వార్త, నిల్చుంటే వార్త అవుతోందన్నారు.

చిటికేసి చెప్పిన దిగ్విజయ్

అతి త్వరలోనే వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఇక తెలంగాణపై చర్చలు, సంప్రదింపులు ఉండవని ఏకంగా నిర్ణయమే ఉంటుందని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 'తెలంగాణపై సీడబ్ల్యూసీ భేటీ ఎప్పుడని ప్రశ్నించగా... దిగ్విజయ్ చిటికెలు వేస్తూ త్వరలో జరుగవచ్చునన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+