ఈ పరిస్థితుల్ని ఒప్పుకోను: ఫెర్గుసన్ విద్యార్థులతో మోడీ

పుణే/హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులను తాను అంగీకరించనని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఆయన ఫెర్గుసన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు డబ్బులు సంపాదించే యంత్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతిక రంగంలో యువత ప్రతిభ కనబరుస్తోందన్నారు. అందువల్లే ప్రపంచ దేశాలు మనలను గుర్తిస్తున్నాయన్నారు. భారత యువతకు అపారమైన ప్రతిభ ఉందన్నారు. వారికి సరైన మార్గదర్శకత్వం అవసరమన్నారు.

Narendra Modi

దేశంలో ప్రస్తుతం నిరాశజనక పరిస్థితులు ఉన్నాయని, వీటిని తాను అంగీకరించనన్నారు. హిందూ మహాసభ నాయకుడు స్వాతంత్ర వీర సావర్కర్ చదివిన కళాశాలలో ప్రసంగించడం తన అదృష్టమని అన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పైన విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు.

తక్కువ కాలంలో అభివృద్ధి చెంది, ఒలింపిక్ క్రీడలు నిర్వహించి దక్షిణ కొరియా సత్తా చాటిందని, కామన్వెల్త్ క్రీడను కూడా మనం సక్రమంగా నిర్వహించలేకపోయామన్నారు. చైనాలా భవిష్యత్తు పైన స్పష్టమైన ఆలోచన ఉండాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్న కారణంగా ఒకప్పుడు ప్రపంచంలోనే మన విద్యావ్యవస్థ అత్యుత్తమంగా ఉండేదన్నారు.

వినాయకుడిని దర్శించుకున్న యడ్డీ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కెజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప ఆదివారం మెదక్ జిల్లా న్యాలకల్ మండలంలోని రేజింతల సిద్ద వినాయకుడిని దర్శించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+