పిల్లిపిల్లల చావుకు మనస్తాపం: మహిళ ఆత్మహత్య

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - స్వర్ణలత కుటుంబం అంబర్‌వేట మారుతీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమె నాలుగు పిల్లి పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటోంది. అయితే, తమ ఇంట్లో పిల్లులను పెంచడానికి వీలు లేదంటూ ఇంటి యజమాని వాటిని బయటకు పంపించేశాడు. దాంతో స్వర్ణలత మనస్తాపానికి గురైంది.
ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. పిల్లి పిల్లులు నరకం అనుభవిస్తూ చనిపోయాయని, తానే ఆ పాపం చేశానని, తన పిల్లుల వద్దకు తాను పోతున్నానని స్వర్ణలత ఆ నోట్‌లో రాసింది. తనకు ఇంట్లో ఏ విధమైన సమస్యలు లేవని ఆమె చెప్పింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని సమాచారం.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనిల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. వసతిగృహంలో ఉంటున్న అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కులకచర్ల మండలానికి చెందిన అనిల్‌కు పదో తరగతిలో అధిక శాతం మార్కులు వచ్చాయి. దీంతో ఈ కళాశాలలో అతనికి ఉచితంగా విద్యనందిస్తున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను సూసైడ్ నోట్ రాసి పెట్టాడు.












Click it and Unblock the Notifications