తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మహత్య

ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం పడ్తన్‌పల్లి కి చెందిన కాంపెల్లి రమేష్ (28) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ హాజీపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మృతుని బంధువులు రాస్తారోకో చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమేష్‌ను గతంలో అత్యాచార యత్నంతో పాటు మరో కేసులో అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. బాధితురాలి బంధువులతో రమేష్ మళ్లీ గొడవ పడగా పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ కోర్టుకు పంపిస్తారేమోనని మానసిక ఆందోళన గురై ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెప్పారు.
గతంలో రెండు కేసులు నమోదయ్యాయని హాజీపూర్ ఎస్ఐ మేకల రవీందర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో మళ్లీ గొడవ పడ్డాడని, దీంతో కేసు నమోదు చేస్తారనే భయంతోనే రమేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అన్నారు.












Click it and Unblock the Notifications