మంచినీళ్లివ్వమని... సర్పంచ్ అభ్యర్థినిపై అత్యాచారం!

ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు అందింది. గ్రామంలో ఉంటున్న సదరు మహిళ భర్త నిరాదరణకు గురయ్యారు. స్థానికంగా ఓ చోట కాపలాదారుగా పని చేస్తోంది. ఆదివారం రాత్రి ఆమె కాపలాదారుగా ఉన్న ప్రాంతానికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు.
మంచినీళ్లు ఇవ్వమని ఆమెను అడిగారు. ఆమె నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా నిందితులు తనను కొట్టి గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మెడలోని తాళిబొట్టు, ఇతర ఆభరణాలను లాక్కెళ్లారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నరు.
బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె పంచాయతీ ఎన్నికల కోసం ఓ పార్టీ మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications